న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 118కి పెరిగింది. కాగా ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో మహారాష్ట్రకు చెందినవే అధికంగా ఉన్నాయి. మహారాష్ట్రలో తాజాగా మరో నలుగురికి కరోనా సోకడంతో ఇప్పటి వరకు 38 కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రకటించారు. అధిక సంఖ్యలో భక్తులు సందర్శించుకునే ఆలయంగా ఈ దేవాలయం ప్రాచుర్యం పొందింది. కాగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆలయం మూసివేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆలయ వైద్య ఆరోగ్య కేంద్రం తెరిచే ఉంటుందని తెలిపారు. (కరోనా: సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం!)
కరోనా అప్‌డేట్: 118కి చేరిన కేసుల సంఖ్య